30న విశాఖలో మహిళల నిరాహార దీక్ష: కేసన
ABN , Publish Date - Aug 24 , 2025 | 05:42 AM
బీసీ మహిళలకు సబ్ కోటా ఇస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తర్వాతే అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో...
మంగళగిరి సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): బీసీ మహిళలకు సబ్ కోటా ఇస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన తర్వాతే అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో మహిళల నిరాహార దీక్ష చేపడుతున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. గుంటూరు జల్లా మంగళగిరిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన జరిగి, ఆపై నియోజకవర్గాల పునర్విభజన చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్లను అమలు జరపాల్సి ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లను దేశంలోని అన్ని వర్గాల మహిళలతో కలిపి 33 శాతం ఇవ్వడం వలన, బలహీన వర్గాలకు చెందిన ఓబీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. 30న విశాఖలో జరిగే నిరాహార దీక్షలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.