Gummadi Sandhya Rani: థ్యాంక్యూ సీఎం సార్!
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:15 AM
స్ర్తీశక్తి పథకంలో ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థికంగా తమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని..
స్ర్తీశక్తి ర్యాలీలో మహిళల జేజేలు.. మహిళలను ఇబ్బంది పెడితే తొక్కతీస్తా
మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: మంత్రి సంధ్యారాణి
సాలూరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): స్ర్తీశక్తి పథకంలో ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థికంగా తమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ జేజేలు పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఆదివారం గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నేతృత్వంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఈ సందడి నెలకొంది. తొలుత పట్టణంలో మంత్రి ఇంటి నుంచి ప్రధాన రహదారి మీదుగా నిర్వహించిన ర్యాలీలో సుమారు ఏడు వేల మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సంధ్యారాణి మాట్లాడారు. మహిళల రక్షణకు, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. మహిళలను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందిపెడితే తొక్కతీస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం త్వరలో కానిస్టేబుల్ పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేయనుందని తెలిపారు.