Share News

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:48 PM

పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని పున రుద్ధరించి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

 సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
రాస్తారోకోలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి

పాతబస్టాండులో సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికులు రాస్తారోకో

బేతంచెర్ల, జూన 19 (ఆంధ్రజ్యోతి): పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని పున రుద్ధరించి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. గురువారం పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీ కార్మికుల నిరాహారదీక్ష 18వ రోజుకు చేరాయి. యాజమాన్యం స్పందించకపోవడంతో గ్రామ పరిధిలో కాకుండా మండల పరిధిలో కార్యక్రమం చేయాలని సిమెంటు ఫ్యాక్టరీ నుంచి బేతంచెర్లకు 200 మంది కార్మికులు వారి కుటుంబాలతో కొత్తబస్టాండు నుంచి ర్యాలీగా పాతబస్టాండు వరకు చేరుకుని మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. వీరికి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. అలాగే సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, బీజేపీ, ట్రేడ్‌ యూనియన ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్ని రకాల రాజకీయ పార్టీల నాయకు లు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేరేవరకు, యాజమాన్యం దిగొచ్చేవరకు అండగా ఉంటామని సంఘా లు భరోసా ఇచ్చాయి. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ ఫ్యాక్టరీ విషయాన్ని, కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ ఎల్ల నాగయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మి, మాజీ ఎంపీపీ సోమశేఖర్‌ రెడ్డి, టీడీపీ సీనియర్‌ నా యకులు పోలూరు రాఘవరెడ్డి, మండల సమన్వయ చైర్మన చంద్రశేఖర్‌, అంబాపురం సర్పంచ శ్రీనివాస్‌ యాదవ్‌, టీడీపీ మైనార్టీ నాయకులు జాకీ రుల్లాబేగ్‌, భీమేశ్వర్‌రెడ్డి, నాయకులు బుగ్గన బ్రహ్మానందరెడ్డి, ఐఎనటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఖాద్రి బాషా, సీపీఐ భార్గవ్‌, సుంకన్న, కాంగ్రెస్‌ ఇనచార్జి గార్లపాటి మద్దిలేటి, డోన, ప్యాపిలి, బేతంచర్ల మండలాల కాంగ్రెస్‌ అద్యక్షులు, సీపీఎం నాయకులు బాస్కర్‌రెడ్డి, వర్దన రెడ్డి, ఎరుకుల చెరువు శివ, కౌన్సిలర్లు బుక్కాపురం సర్పంచ, నాయకులు, రాముడు,సురేష్‌, సుభాన, వాసు, కార్మికులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమం అభివృద్ధే లక్ష్యం

డోన నియోజకవర్గ ప్రజా సంక్షేమం అభివృద్దే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఆర్‌ అండ్‌బీ అతిథి గృహంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్సను నిర్వహించి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్‌ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లయ్య, నాయకులు మధుశేఖర్‌ కోరారు. కార్యక్రమంలో టింగు, యువరాజు, వెంకటరమణ, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:48 PM