Ganta Challenges YCP: ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:27 AM
వైసీపీ హయాంలో ప్రారంభించి, పూర్తిచేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు...
విశాఖపట్నం, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ప్రారంభించి, పూర్తిచేసిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. విశాఖలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కియా వంటి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేకపోయింది. రెండు రోజులు జరిగిన పెట్టుబడిదారుల సదస్సుతో ప్రపంచమంతా విశాఖ వైపే చూస్తోంది. గూగుల్ డేటా సెంటర్ విశాఖలో పెడుతున్నామని సీఈవో సుందర్ పిచ్చై మూడు నెలల ముందు ప్రకటిస్తే.. వైసీపీ హయాంలోనే తీసుకువచ్చామని ఆ పార్టీ నేతలు ప్రకటించడం హాస్యాస్పదం’ అని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుపై వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.