Share News

Deputy CM Pawan: ది వైల్డ్‌ ఈస్ట్‌ పుస్తకం

ABN , Publish Date - Nov 14 , 2025 | 06:00 AM

శేషాచలం అడవులు, తూర్పు కనుమల్లోని ఎర్ర చందనం సహా విలువైన సహజ వనరుల దోపిడీకి సాక్ష్యంగా ‘ది వైల్డ్‌ ఈస్ట్‌’ అనే పుస్తకం నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Deputy CM Pawan: ది వైల్డ్‌ ఈస్ట్‌ పుస్తకం

  • సహజ వనరుల దోపిడీకి దర్పణం

  • వ్యవస్థ కళ్లముందే దోచుకున్న తీరును బహిర్గతం చేస్తుంది: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): శేషాచలం అడవులు, తూర్పు కనుమల్లోని ఎర్ర చందనం సహా విలువైన సహజ వనరుల దోపిడీకి సాక్ష్యంగా ‘ది వైల్డ్‌ ఈస్ట్‌’ అనే పుస్తకం నిలుస్తుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం ఈమేరకు ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘‘కొంత కాలం క్రితం నేను ది వైల్డ్‌ ఈస్ట్‌ అనే పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. అందులోని వివరాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ గ్రంథం ఎర్రచందనం సహా విలువైన సహజ వనరులను వ్యవస్థ కళ్లముందే ఎలా దోచుకుపోయారో బహిర్గతం చేస్తుంది. కొంతమంది రాజకీయ నేతలు మాఫియా డానుల్లా వ్యవహరించిన తీరు ఇందులో బయటపడింది. చిన్న స్థాయి కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి... మాఫియాలో కింగ్‌పిన్‌గా ఎదిగి, ఎలా ఎర్రచందనం అక్రమ రవాణా సామ్రాజ్యానికి అధిపతిగా మారాడో అన్నదాన్ని దాదాపు సినిమా సన్నివేశంలా చూపించారు. లోభం, అధికారం కోసం అతడు నిర్మించిన నేర సామ్రాజ్యం పుస్తకంలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ప్రజలు ఈ పుస్తకాన్ని చదివినప్పుడు, మీరు నేరాన్ని మాత్రమే అర్థం చేసుకోరు... భూమి, అరణ్యాలు, ప్రకృతి, ప్రజలపై జరిగిన విశ్వాసఘాతకాన్ని కూడా లోతుగా అనుభూతి చెందుతారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 06:02 AM