Sri Sathya Sai District: భర్త సెల్‌ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య
ABN , Publish Date - Aug 18 , 2025 | 06:58 AM
భర్త సెల్‌ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముదిగుబ్బ, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): భర్త సెల్‌ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముదిగుబ్బ పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన సుధీర్ కట్కర్‌కు నీమా కట్కర్(18)తో ఆరునెలల క్రితం వివాహమైంది. వీరు బొగ్గులు కాల్చే పనికి ముదిగుబ్బ మండలానికి వలస వచ్చారు. ఆదివారం సాయం త్రం సుధీర్ కట్కర్‌ను సెల్‌ఫోన్ ఇవ్వాలని నీమా కట్కర్ అడిగింది. అతడు చార్జింగ్ లేదంటూ భార్యతో వాగ్వాదం చేసి వెళ్లిపోయాడు. మనస్తాపం చెందిన నీమా కట్కర్ గుడిసె సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుంది.