Share News

భార్య, అత్తపై వేట కొడవలితో దాడి

ABN , Publish Date - May 30 , 2025 | 11:57 PM

భార్య, అత్తపై వేట కొడవలితో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ సంఘటన మండలంలోని కంబదహల్‌ గ్రామంలో శుక్రవారం జరిగింది.

 భార్య, అత్తపై  వేట కొడవలితో దాడి

పెద్దకడబూరు, మే30(ఆంధ్రజ్యోతి)ః భార్య, అత్తపై వేట కొడవలితో ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ సంఘటన మండలంలోని కంబదహల్‌ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన జయమ్మ కూమార్తె రేణుక అలియాస్‌ జయంతిని ఆలూరు మండలం అంగస్కల్‌ గ్రామానికి చెందిన వేమారెడ్డికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కుటుంబ కలహాలతో మనస్పర్ధలు వచ్చి జయంతి గత మూడేళ్లుగా కంబదహల్‌ గ్రామాంలోనే తల్లి జయమ్మ వద్ద ఉంటున్నది. ఈ నేపథ్యంలో తనకు విడాకులు కావాలని భర్త వేమారెడ్డి కోర్టుకు వెళ్లాడు. పైగా ఫోన చేసి చంపుతానని బెదిరిస్తున్నాడు. శుక్రవారం ఉదయం వేమారెడ్డి అత్త ఇంటికి వెళ్లి వెంట తీసుకెళ్లిన వేట కొడవలితో దాడి చేయడంతో భార్య జయంతి, అత్త జయమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు జయంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Updated Date - May 30 , 2025 | 11:57 PM