Minister Kondapalli Srinivas: నేడు కొత్తగా లక్ష మందికి వితంతు పింఛన్లు
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:07 AM
జీవిత భాగస్వామి విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 1,09,155 మంది వితంతువులకు కొత్తగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జీవిత భాగస్వామి విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 1,09,155 మంది వితంతువులకు కొత్తగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఆగస్టు 1న పెన్షన్లు చెల్లించేందుకు రూ.2750 కోట్లను గ్రామ, వార్డ్ సచివాలయాల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది నవంబరు 1న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛను తీసుకుంటూ చనిపోయిన వారి భార్యలకు మరుసటి నెల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే 2019 మే నెల నుంచి 2024 అక్టోబరు మధ్య కాలంలో పెన్షన్ తీసుకుంటున్న భర్తను కోల్పోయిన మహిళలకు పెన్షన్ మంజూరు కాలేదన్నారు. అలా మిగిలిపోయిన వారిని గుర్తించి ఈ నెల నుంచి వారికి స్పౌజ్ కేటగిరీ కింద పింఛను మంజూరు చేసినట్టు చెప్పారు.