మెరుగైన వైద్యసేవలు ఎక్కడ?
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:43 PM
పైన పటా రం, లోనలొటారం అనే నానుడుకి బద్వేలులోని ప్రభు త్వ సామాజిక వైద్యకేంద్రానికి సరిపోతుంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అందంగా భవనాలు నిర్మించి 50 పడకలు ఏర్పాట్లు చేసినా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంలేదు.

కోట్లు వెచ్చించి నిర్మించిన బద్వేలు ప్రభుత్వ వైద్యశాల
వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత,
పనిచేయని యంత్రాలు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఇక్కట్లు పడుతున్న రోగులు
బద్వేలుటౌన, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : పైన పటా రం, లోనలొటారం అనే నానుడుకి బద్వేలులోని ప్రభు త్వ సామాజిక వైద్యకేంద్రానికి సరిపోతుంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అందంగా భవనాలు నిర్మించి 50 పడకలు ఏర్పాట్లు చేసినా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంలేదు. వైద్యశాలలో తగినంత మంది వైద్యులను నియమించ కపోవడంతో అత్యవసర చికిత్సలతోపాటు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 87వేల మంది జనాభా, పంచాయతీల పరిధిలో 40వేలపైనే జనాభా ఉంది. వారితోపాటు బద్వేలు ఆసుపత్రి పరిధిలో మరో 20పంచా యతీలున్నాయి. ఈ ఆసుపత్రికి రోజుకు 300 నుంచి 400 మంది రోగులు వస్తుంటారు. అయితే అక్కడ సరైన పరికరాలు లేక, ఉన్నవి పనిచేయక ప్రజలకు సరైనవైద్యం అందక, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. పేరుకే బద్వేలు 50పడకల ఆసుపత్రి అయినా అందులో 12మంది వైద్యు లు ఉండాల్సి ఉండగా, 6మంది మాత్రమే వైద్యసేవలు అందిస్తున్నారు. జనరల్ మెడిసిన, జనరల్ సర్జన, చిన్నపిల్లల వైద్యులు, గైనకాలజిస్ట్ లేరు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అంది స్తామని నాయకులు వాగ్దానాలు చేశారే తప్ప, వైద్యులను నియమించడం లోకానీ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక లక్ష్యం నెరవేరడంలేదు.
పరికరాలు ఉన్నా నిరుపయోగం :
లక్షల రూపాయలు వెచ్చించి బద్వేలు ప్రభుత్వ వైద్యశాలలో 5వెంటిలేటర్లు, 50 బెడ్లు ఏర్పాటు చేశారు. అయితే వెంటిలేటర్లు వినియోగించుకునేందుకు ఆ విభాగానికి సంబంధించిన వైద్యులు లేకపోవడంతో యంత్రాలు నిరుప యోగంగా ఉన్నాయి. ఆల్ర్టాస్కానింగ్ మిషన మరమ్మతుల్లో ఉంది. గైనకా లజిస్ట్ వారంలో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండడం ఎప్పుడు వస్తారో? తెలియక గర్భిణులు నిరాశతో వెనుతిరిగి ప్రైవేటు ఆసు పత్రులకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు. అలాగే చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నా, సంబంధిత పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వచ్చిన రోగులకు పూర్తిస్థాయిలో చికిత్స చేయలేక మందులతో సరిపెడుతున్నారు. అలాగే కంటి వైద్యనిపుణులు గురు, శనివారాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నా విషయం ప్రజ లకు తెలియక వెనుతిరుగుతున్నారు. నియోజకవర్గంలోనే ఇది పెద్దాసు పత్రిగా పేరు పొందినప్పటికీ సరైన వైద్యసేవలు అందడంలేదు. ఇప్పటికైనా బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న యంత్రాలను మరమ్మతులు చేయడంతో పాటు వైద్యుల కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నివేళలా సేవలు అందిస్తాం
సిబ్బంది కొరత ఉన్నా రోగులకు అన్నివేళలా వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్యుల కొరత ఉందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం, వైద్యులను నియమిస్తే పూర్తిస్థాయిలో ప్రజలకు వైద్యసేవలను అందించవచ్చు. అత్య వసర కేసులకు 24 గంటలు అందుబాటులో ఉంటాను, అత్యవసరమైతే 7893435783 నెంబర్‌కు ఫోనచేస్తే పదినిమిషాల్లో ఆసుపత్రికి వచ్చి సేవ లు అందిస్తున్నాం.
-డాక్టర్ సుబ్బారెడ్డి,
ప్రభుత్వాసుపత్రి సూపరెంటెండెంట్, బద్వేలు