Share News

ఏ మొహం పెట్టుకుని నర్సీపట్నం వెళ్తావ్‌?: పట్టాభి

ABN , Publish Date - Oct 09 , 2025 | 06:17 AM

నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ నిర్మాణ అంచనా వ్యయం రూ.500 కోట్లు అయితే, జగన్‌ హయాంలో కేవలం రూ.11.7 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని...

ఏ మొహం పెట్టుకుని నర్సీపట్నం వెళ్తావ్‌?: పట్టాభి

అమరావతి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ నిర్మాణ అంచనా వ్యయం రూ.500 కోట్లు అయితే, జగన్‌ హయాంలో కేవలం రూ.11.7 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అలాంటి వ్యక్తి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు అక్కడికి వెళుతున్నాడని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి నిలదీశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూడా పీపీపీ మోడల్‌లోనే ప్రైవేటు హాస్పిటల్స్‌తో ఒప్పందాలు చేసుకున్న విషయం జగన్‌ తెలుసుకోవాలన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 06:18 AM