కూటమి పాలనలోనే సంక్షేమం
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:03 PM
కూటమి పాలనలోనే విశ్వబ్రాహ్మణుల సంక్షేమం సాధ్యపడుతోందని ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన చైర్‌పర్సన కమ్మరి పార్వతమ్మ అన్నా రు.
విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన పార్వతమ్మ
ఆత్మకూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కూటమి పాలనలోనే విశ్వబ్రాహ్మణుల సంక్షేమం సాధ్యపడుతోందని ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన చైర్‌పర్సన కమ్మరి పార్వతమ్మ అన్నా రు. మంగళవారం ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వ కంగా కలిశారు. ఆమె మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ యువజన పథకం గురించి అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా పనిముట్లను ఉపయోగించుకుని కుల వృత్తిలో రాణించాలని ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం తమ కార్పొరేషన అన్ని విధాలుగా కృషి చేస్తుందని వివరించారు. కాగా కుల వృత్తులకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ మహిళలకు కూడా ప్రోత్సాహాన్ని అందించేలా ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు విశ్వరూపాచారి, సహదేవాచారి, మల్లికార్జున ఆచారి, రాఘవ ఆచారి, రాజగోపాల్ ఆచారి, మల్లయ్య ఆచారి, సత్యనారాయణ ఆచారి, శివయ్య ఆచారి, శంకరాచారి, సురేష్ ఆచారి, కుమార్ ఆచారి, ఓంకారం ఆచారి పాల్గొన్నారు.