Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:26 AM

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.

  అర్హులందరికీ సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే
కోనేటమ్మపల్లెలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జయసూర్య.

నందికొట్కూరు రూరల్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. బుదవారం నందికొట్కూరు మండలంలోని కోనేటమ్మపల్లె గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే జయసూర్య, కార్యకర్తలు నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేసే సంక్షేమపథకాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ దామోదరెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన వీరం ప్రసాదరెడ్డి, వెంకటేశ్వర్లు, ఉదయకిరణ్‌రెడ్డి, సింగిల్‌ విండో మాజీ చైర్మన మద్దూరు హరిసర్వోత్తమరెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

మిడుతూరు: చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి సాఽధ్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మాసపేట నిర్వహించారు. ఏడాదిలో చేపట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దశరథరామయ్య, తహసీల్దార్‌ శ్రీనివాసులు, టీడీపీ మండల కన్వినర్‌ కాతా రమేష్‌ రెడ్డి, రాజ శేఖర రెడ్డి, వీరారెడ్డి వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం

- శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకుని ఆత్మకూరు పట్టణంలోని 5వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం ఎమ్మెల్యేయ బుడ్డా ఇంటింటికి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ శ్రీశైల నియోజకవర్గంలో ఏడాదిలోనే రూ.150కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు అన్ని విధాలుగా పాటుపడుతానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్లాపురం బాషా, నాగూర్‌ఖాన, షాబుద్దిన, ఖాజమోద్దిన, సద్దాం, నజీర్‌అహ్మద్‌, న్యామతుల్లా, అన్సర్‌, సుబ్బయ్య, అష్రఫ్‌ అలి, మునీర్‌, పెయింటర్‌ రఫీక్‌, జలీల్‌, నబిరసూల్‌ తదితరులు ఉన్నారు.

కొత్తపల్లి: టీడీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందని టీడీపీ మండల కన్వీనర్‌ నారపురెడ్డి, క్లస్టర్‌ ఇనచార్జి లింగస్వామి గౌడు అన్నారు. బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మండలంలోని సింగరాజుపల్లి, చిన్నగుమ్మడాపురం, పెద్ద గుమ్మడాపురం గ్రామాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ నక్కా విజయకుమార్‌, మాజీ మండల కన్వీనర్‌ జడ్‌.వెంకటరెడ్డి, యూనిట్‌ ఇనచార్జి వెంకటస్వామిరెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, శివారెడ్డి, మల్లయ్య, ఏ.దర్గయ్య, రాము, ఎల్‌ఐసీ దరగయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:26 AM