రజకుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:36 PM
రజకుల సం క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
నంద్యాల టౌన, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : రజకుల సం క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఆదివారం నంద్యాలలోని ఆర్కే ఫంక్షన హాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా రజక సేవా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రజక ఆకాంక్ష సభ-5 కు ఎంపీతో పాటు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు కృష్ణమ్మ ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశలో రజకులకు మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో దోబీ ఘాట్లు నిర్మించిన ఘనత దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌కే దక్కు తుందన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో దోబీ ఘాట్ల నిర్మాణాలు, కమ్యూనిటీ హాలు ఏర్పా టు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర రజక కార్పొరేషన చైర్ పర్సన సావిత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు అన్ని రంగా ల్లో రాణించేలా వారిని చైతన్య పరుస్తున్నామన్నారు. కూటమి ప్రభు త్వం కార్పొరేషన నిధుల ద్వారా రజకుల అభ్యున్నతికి పాటుపడు తుందన్నారు. రజక కార్పొరేషన డైరెక్టర్లు రామాంజనేయులు, చంద్ర శేఖర్, సతీశకుమార్, దుర్గారావు, చంద్ర, ఏపీఎస్‌ఎస్‌సీఏ బోర్డు మెం బరు మంజీరా సీడ్స్ అధినేత రామ మద్దిలేటి, కర్నూలు జిల్లా సీని యర్ రజక నాయకులు నాగరాజు, మధు, గోల్డ్ శీను, లాయర్లు లోకే శ, చంద్రశేఖర్, నంద్యాల జిల్లా సేవా సంఘం గౌరవ సలహాదారులు సుకుమాంబ కుమారి, అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.