Minister Dola Balaveeranjaneya: కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:30 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు.
ఏడాదిలో అద్భుతాలు సాధించామని చెప్పడం లేదు
కానీ... గత పాలకులకన్నా మెరుగ్గా చేస్తున్నాం: మంత్రి డోలా
తిరుమల, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు.తిరుమల శ్రీవారిని శనివారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఎప్పుడూలేని విధంగా రూ.310 కోట్ల నిధులు కేటాయించాయ.స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రూ.100 కోట్లతో నూతన హాస్టళ్ల నిర్మాణం,రూ.58 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాం.మరో రూ.143 కోట్లు హాస్టళ్లు, స్కూళ్ల మరమ్మతులకు జారీ అయ్యాయి.గతంలో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిధులు కేటాయించలేదు.గడిచిన ఏడాదిలో అద్భుతాలు సాధించామని చెప్పడం లేదు కానీ... గత పాలకులకంటే మెరుగ్గా పనిచేస్తున్నాం.నాణ్యమైన బియ్యంతో విద్యార్థులకు భోజనం అందిస్తున్నాం. పీ 4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అభివృద్ధి,సంక్షేమం అమలు చేసే విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదని స్వామిని కోరుకున్నా’ అని మంత్రి డోలా చెప్పారు.