Supreme Court; సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:55 AM
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పును స్వాగతిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు...
మంత్రి ఫరూక్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పును స్వాగతిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం సవరణలపై ముస్లిం వర్గాల్లో నెలకొన్న ఆందోళనను దృష్టిలో పెట్టుకుని.. ఈ అంశాన్ని జేపీసీ దృష్టికి వెళ్లేలా సీఎం చంద్రబాబు కృషి చేశారని ఫరూక్ తెలిపారు. అప్పుడు జేపీసీ కొన్ని అసమంజస సవరణలను తొలగించగా, ఇప్పుడు సుప్రీంకోర్టు మిగిలిన వాటిపై స్టే విధించిందన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి వల్లే ముస్లిం సమాజానికి న్యాయం దక్కిందని అజీజ్ అన్నారు.