డోనను అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం
ABN , Publish Date - May 20 , 2025 | 12:26 AM
డోన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
డోన రూరల్, మే 19 (ఆంధ్రజ్యోతి): డోన నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. సోమవారం పట్టణంలోని సాయి ఫంక్షన హాలులో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి డోన, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరిం చా రు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటీవల ఆపరేషన సిందూరలో వీరమరణం పొందిన వీరజవాన్లను స్మరిం చుకుంటూ, నివాళులర్పించారు. అనంతర సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ డోన నియోజకవర్గ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన, వ్యవసాయాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యాలన్నారు. గత వైసీపీ పాలకులు డోన నియోజకవర్గంలో కనీసం చెరువులు నింపే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేదన్నారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాయకత్వలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటు పడుతామని తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉండి, వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, కోట్రికే ఫణిరాజ్, టీడీపీ మండల కార్యదర్శి శ్రీనివాసులు యాదవ్, సీనియర్ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఓబులాపురం శేషిరెడ్డి, కమలాపురం సర్పంచ రేగటి అర్జున రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన టీఈ కేశన్న గౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, మాజీ సర్పంచ పెద్ద కేశవయ్యగౌడు, మున్సిపల్ వైస్ చైర్మన కోట్రికే హరికిషణ్, ఓంప్రకాష్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల నాయకులు తొప్పల శ్రీనివాసులు, ఆర్‌ఈ నాగరాజు, బుగ్గన ప్రసన్నలక్ష్మి, ఎల్లనాగయ్య, ఉన్నం చంద్రశేఖర్, పాల్గొన్నారు.