Share News

రైతులను ఆదుకుంటాం

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:32 PM

మొంథా తుఫాన ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు.

రైతులను ఆదుకుంటాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

కొత్తపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో ఎంపీపీ కిచ్చెన్నగారి కుసుమలత అధ్యక్షతన డిప్యూటీ ఎంపీడీవో సుబ్బారావు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తే పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తెలపాలన్నారు. అనంతరం దుద్యాల సర్పంచ శోభలత, గువ్వలకుంట్ల ఎంపీటీసీ స్రవంతి, ముసలిమడుగు సర్పంచ జమీలాబీ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ సోముల సుధాకర్‌ రెడ్డి మత్య్స శాఖ అధికారి భరత్వాల్‌ నాయక్‌, తహసీల్దార్‌ ఉమారాణి, ఎంఈవో నాగరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక

మండలంలోని నందికుంట గ్రామంలో వైసీపీని వీడి దాదాపు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం స్థానిక టీడీపీ నాయకులు జహరుల్లా ఆధ్వర్యంలో టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇనచార్జి మాండ్ర శివానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సమక్షంలో ఆరుమంది వార్డు సభ్యులతో పాటు 50 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కొత్తపల్లి, నందికొట్కూరు మండల కన్వీనర్లు లింగస్వామిగౌడు, మాండ్ర సురేంద్రనాథ్‌రెడ్డి, నారపురెడ్డి, వీరం ప్రసాద్‌ రెడ్డి, కడియం వెంకటేశ్వర్లు యాదవ్‌, నాగేశ్వర రావు యాదవ్‌, షమీవుల్లా ఉన్నారు.

ప్రతి కాలనీలో పైపులైన ఏర్పాటు చేయాలి

నందికొట్కూరు: గ్రామంలోని ప్రతి కాలనీలో మంచినీటి పైపులైన ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశించారు. మంగళవారం అల్లూరు గ్రామంలో జరుగుతున్న తాగునీటి నూతన పైపులైన పనులను టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇనచార్జి మాండ్ర శివానందరెడ్డితో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు కురువ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ శ్రీనివాసులు, ఏఈ వేణుమాధురి, గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:32 PM