సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాం
ABN , Publish Date - May 30 , 2025 | 11:57 PM
న్నికల హామీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల ను అమలు చేసి తీరుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఫ రోడ్లు భవనాల శాఖ మంత్రి
బీసీ జనార్దనరెడ్డి
బనగానపల్లె, మే 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల ను అమలు చేసి తీరుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శుక్ర వారం నందవరం గ్రామంలో పూర్తి అధ్వాన స్థితిలో ఉన్న డొంక రస్తాలో రూ.60లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మండల టీడీపీ అధ్యక్షుడు పీవీ.కుమార్‌రెడ్డితో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఒక్క సీసీ రోడ్డు అయినా నిర్మించారా అని బీసీ ప్రశ్నించారు. బనగానపల్లె నియోజక వర్గంలో ఇప్పటికి రూ.60 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. బనగానపల్లె వేసవికాలంలో కూడా తాగునీటి సమస్యలేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ బనగానపల్లె మండల అ ద్యక్షుడు పీవీ.కుమార్‌రెడ్డి, సర్పంచ లక్ష్మిదేవి. పీవీ.నాగార్జునరెడ్డి, ఎంపీడీవో రమణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వేణు గో పాల్, ఏఈ సాయికృష్ణ, పంచా యతీ రాజ్ ఏఈ రమణ, టీడీపీ నాయ కులు వెంగన్న, సూర్యనారా యణరెడ్డి, గొల్ల వెంకటన్న పాల్గొన్నారు.
కల్యాణమండపానికి భూమి పూజ
మండలంలోని ప్రముఖ శక్తిక్షేత్రమైన నందవరం చౌడే శ్వరీమాత ఆలయం ప్రాం గణంలో రూ.3కోట్ల వ్య యం తో నిర్మించనున్న కల్యాణ మండపానికి మంత్రి బీసీ జనార్ద నరెడ్డి భూమి పూజ చేశా రు. అనంతరం శిలాఫల కా న్ని మంత్రి ప్రా రంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు, నందవరం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన పీవీ.కుమార్‌రెడ్డి, తెలుగుయువత నాయకుడు పీవీ. నాగార్జున రెడ్డి, ఆలయ కార్య నిర్వాహకాధికారి కామేశ్వర మ్మ, సిబ్బంది, పూజారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
చిత్తశుద్ధితో ప్రజాసమస్యలను అధికారులు పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దనరెడ్డి అ న్నారు. శుక్రవారం రాత్రి మంత్రి క్యాంపు కార్యా లయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశిం చారు. దరఖాస్తులు మంత్రి స్వీకరించి సాను కూలంగా స్పందించడంతో అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు. అర్జీలు ఇవ్వడానికి వివిధ వర్గాల ప్రజలు, కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు, సామాన్యులు తరలివచ్చారు.