Share News

పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలి

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:50 PM

ప్రతి విద్యార్థి పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలని ఆర్జీఎం విద్యాసంస్థల చైర్మన శాంతిరాముడు సూచించారు.

పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలి
జ్యోతి వెలిగిస్తున్న శాంతిరాముడు

ఆర్జీఎం విద్యాసంస్థల చైర్మన శాంతిరాముడు

పాణ్యం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలని ఆర్జీఎం విద్యాసంస్థల చైర్మన శాంతిరాముడు సూచించారు. శుక్రవారం మండలంలోని శాంతిరాం ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఎ్‌సఈ విభాగం ఆధ్వర్యంలో సిగ్మా సమన్వయ 2కె25 సాంకేతిక సదస్సు నిర్వహించారు. సదస్సును విద్యాసంస్థల చైర్మన శాంతిరాముడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. సాంకేతిక విద్యను ప్రయోగాత్మకంగా వినియోగించుకోవాలన్నారు. సాంకేతిక సదస్సులు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడతాయన్నారు. ఈ సదస్సులో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పేపర్‌ ప్రజంటేషన, టెక్‌ క్విజ్‌, కోడింగ్‌ కాంటెస్ట్‌, మోడల్‌ ఎక్స్‌పో తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 92 మంది పరిశోధనాత్మక పేపర్లు ప్రదర్శించారు. విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న స్టాల్స్‌లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం, హెచవోడీలు పారూక్‌, రమాదేవి, డేవిడ్‌ సుకీర్తికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 11:50 PM