మనం నేర్చుకున్నది ఇతరులకు అందించాలి
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:34 PM
మనం చదివినది.. నేర్చుకున్నది ఇతరలకు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస రెడ్డి
ఎమ్మిగనూరు, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): మనం చదివినది.. నేర్చుకున్నది ఇతరలకు అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణ శివారులోని ఆదోని రోడ్డులో ఉన్న విశాల గార్డెనలో ఆదోని ఆర్ట్ష్స్ కాలేజీలో 1971-1975లో బీఏ, బీకాం చదివిన విద్యార్థుల అపూర్వ సమ్మేళనం సుప్రీంకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా కళాశాల పూర్వ విద్యార్థి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్ఠిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనతో పాటు చదువుకున్న వారంత ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. తాను ఈ స్థానంలో ఉండటానికి అప్పటి ఉపాధ్యాయులే కారణమని అన్నారు. డీగ్రీ పూర్తయ్యాక ఎస్‌కేడీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం పూర్తి చేసినట్లు తెలిపారు. చదువు పూర్తయ్యాక ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఇజ్రాయిల్ కవి రచించిన ఓ కవితతో స్ఫూర్తి పొంది హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియామకం కావడానికి కృషి చేశానని అన్నారు. అనంతరం జస్ట్టిస్ శ్రీనివాస రెడ్డిని పురుషోత్తం రెడ్డి దంపతులు, పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
ఫ 50 ఏళ్లు స్నేహ బంధంః ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స కాలేజీలో 1971-75 మధ్యలో చదివిన పూర్వ విద్యార్థులు బళ్లారి, బెంగుళూరు, అమెరికా, పూనా, హైదరాబాద్, వెలుగోడు, కర్నూలు తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆనాటి మిత్రులను కలవడానికి వీరంతా రావడంతో విశాల గార్డెన కళకళలాడింది. ఎప్పుడో 50ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నవారు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాత జ్ఞ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కెనడాలో నివాసం ఉంటున్న పూర్వ విద్యార్థిని లిత మాట్లాడుతూ 50ఏళ్ల తర్వాత ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే రిటైర్ట్ డిప్యూటీ కమిషనర్ రంగన్న మాట్లాడుతూ తమ గురువుల వల్లే ఈ స్థాయికి రాగలిగామన్నారు. అనంతరం గురువులు కేశవరెడ్డి, దత్తు, పీవీ రావు, నాగిరెడ్డిలను పూర్వ విద్యార్థులు సన్మానించారు.