ఆర్డీఎస్ ఆనకట్టకు జలకళ
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:48 PM
కోసిగి మండలంలోని అగసనూరు సమీపంలోని తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ఆనకట్టకు జలకళ సంతరించుకుంది.
కోసిగి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండలంలోని అగసనూరు సమీపంలోని తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ఆనకట్టకు జలకళ సంతరించుకుంది. మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్‌కు భారీగా వరద పోటెత్తడంతో జలకళ సంతరించుకుంది. పశ్చిమ ప్రాంతంతో పాటు ఎగువన ఉన్న కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు సుమారు 1.20 లక్షల క్యూసెక్కుల నీరు ఆర్డీఎస్‌కు పోటెత్తడంతో ఆర్డీఎస్ ఆనకట్టపై వరద నీరు ఉధృతంగా దిగువకు ప్రవహిస్తోంది. దీంతో తుంగభద్ర నదితీర గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ వేణుగోపాల్, సీఐ మంజునాథ్, ఆయా నదితీర గ్రామాల ప్రజలకు తెలియజేశారు. చేపలవేటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద వీఆర్‌ఏలను, కానిస్టేబుళ్లను బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపారు.