Srisailam Dam : శ్రీశైలం మూడు గేట్ల నుంచి నీటి విడుదల
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:55 AM
శ్రీశైలం జలాశయం మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 79,956 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి ఎడమగట్టు .
నంద్యాల, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 79,956 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి ఎడమగట్టు జల ఉత్పాదన కింద 66,224 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 1,27,130 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. జలాశయంలో గురువారం రాత్రి 9 గంటలకు 881.90 అడుగుల నీటి నిల్వ ఉండగా.. నీటి లభ్యత 198.3623 టీఎంసీలుగా నమోదైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డ్యాం గేట్లకు అధికారులు జాతీయ పతాక రంగుల్లో విద్యుత్ దీపాలంకరణ చేశారు. దీంతో శ్రీశైలం జలాశయం త్రివర్ణ శోభను సంతరించుకుంది.