పార్క్‌కు కేటాయింపుతో నీటికి ఇబ్బందులు
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:02 AM
తాటిపూడి రిజర్వాయర్ నుంచి జిందాల్ భూముల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు నీటిని కేటాయించ డంతో సాగునీటికి ఇబ్బందులువస్తామని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ తెలిపారు
శృంగవరపుకోట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తాటిపూడి రిజర్వాయర్ నుంచి జిందాల్ భూముల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు నీటిని కేటాయించ డంతో సాగునీటికి ఇబ్బందులువస్తామని ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ తెలిపారు.జిందాల్ భూనిర్వాసితులు నిరసన తెలుపుకొనేందుకు జనసంచారం లేని ప్రదేశంలో పోలీసులు అనుమతి ఇవ్వడం అన్యాయమని ఆరోపించారు. హైకోర్టు సూచనతో బహిరంగ ప్రదేశంలో జిందాల్ భూనిర్వాసితులు నిరసన తెలుపుకోనేందుకు పోలీస్ శాఖ అనుమతి ఇవ్వడంతో బుధవారం శృంగవరపుకోట మండలం మూలబొడ ్డవర పంచాయతీ అమ్మపాలెం రైతు సేవా కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా జగన్ మాట్లాడుతూ సెక్షన్ 30ను చూపించి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ఎమ్మెల్సీఇందుకూరి రఘురాజు జిందాల్‌కు అప్పగించిన భూముల సమస్యను ప్రస్తావిం చడంతో న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నట్లు నిర్వాసితులు పేర్కొన్నారు.