Water Supply: కుప్పంలో జల సిరుల సవ్వడి
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:33 AM
చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరమసముద్రం మొరవ పారింది. నీటి విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పినట్లు కుప్పం నియోజకవర్గానికి రెండేళ్ల ముందుగానే...
కుప్పం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరమసముద్రం మొరవ పారింది. నీటి విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పినట్లు కుప్పం నియోజకవర్గానికి రెండేళ్ల ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చేశాయి. హంద్రీనీవా కాలువలో ఉరకలెత్తి వస్తున్న కృష్ణా జలాలు, పరమసముద్రం చెరువు నిండి మొరవ పారి, వీరప్పనాయుని చెరువు వైపు వడివడిగా సాగుతున్నాయి. హంద్రీనీవా కాలువ చుక్క నీరు లేకుండా ఎండిపోయిందంటూ వైసీపీ వర్గాలు చేసిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. శ్రీశైలం నుంచి 733 కిలోమీటర్లు ప్రయాణించిన కృష్ణమ్మ పరమసముద్రం చెరువును నింపి, మొరవల గుండా పారింది. పరిసర గ్రామాల ప్రజలు పిల్లాపాపలతో తరలివచ్చారు. కోళ్లను గావు ఇచ్చి గంగమ్మకు మొక్కులు తీర్చుకున్నారు.