Share News

PCB Chairman: వ్యర్థాల పునర్వినియోగంతో పర్యావరణానికి మేలు

ABN , Publish Date - Aug 23 , 2025 | 06:46 AM

రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, వ్యవసాయ, ఉద్యాన, పాడి, మత్స్య పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చవచ్చని...

 PCB Chairman: వ్యర్థాల పునర్వినియోగంతో పర్యావరణానికి మేలు

  • పీసీబీ వర్క్‌షాప్‌లో చైర్మన్‌ కృష్ణయ్య

అమరావతి, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, వ్యవసాయ, ఉద్యాన, పాడి, మత్స్య పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను విలువైన ఉత్పత్తులుగా మార్చవచ్చని, ఆ దిశగా అడుగులేస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చైర్మన్‌ పి.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం విజయవాడలోని పీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. వ్యర్థాలను వినియోగించుకుని ఉపాధి పెంచుకుంటూ, ఆర్థికంగా ఎదిగేందుకు మంచి అవకాశాలెలా కల్పించాలి..? అన్న అంశాలపై చర్చించారు. ఈ వర్క్‌షా్‌పనకు వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, పీసీబీ సభ్యకార్యదర్శి శరవణన్‌, ఇతర శాఖల ఉన్నతాధికారులు, పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు హాజరయ్యారు. వ్యవసాయం, ఆక్వా, పాడి పరిశ్రమ, పౌల్ర్టీ తదితర రంగాల్లో ఏ మేరకు వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి? వాటిని ఎలా నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయో ఆ శాఖల అధికారులు వివరించారు. పీసీబీ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌, ఇతర నిపుణులు తమ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను చర్చించారు. పీసీబీ చైర్మన్‌ కృష్ణయ్య మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన రీసైక్లింగ్‌ పాలసీ ద్వారా పర్యావరణ అనుకూల పరిశ్రమలు రాష్ట్రానికి ఎక్కువగా వస్తాయి. రీసైక్లింగ్‌కు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో ఎక్కువగా పెట్టేందుకు అవకాశం ఉంది’ అని తెలిపారు.

Updated Date - Aug 23 , 2025 | 06:46 AM