Share News

కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషికి ఘనస్వాగతం

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:36 PM

రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన కేంద్ర పౌర సర ఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాదజోషికి ఆదివారం రాత్రి తుంగభద్ర రైల్వేస్టేషనలో అధికారులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

   కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషికి  ఘనస్వాగతం
కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషికి స్వాగతం పలుకుతున్న నాయకులు, అధికారులు, మఠం ఉద్యోగులు

మంత్రాలయం, జూన 15(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన కేంద్ర పౌర సర ఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాదజోషికి ఆదివారం రాత్రి తుంగభద్ర రైల్వేస్టేషనలో అధికారులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పద్మనాభతీర్థ గెస్టు హౌస్‌ వద్ద మంత్రి బీసీ జనార్దన రెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి రాఘవేంద్రరెడ్డి, బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పైబావి అమర్నాథ్‌ రెడ్డి, జేసీ డా.బి.నవ్య, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, అడిషినల్‌ ఎస్పీ హుశేన పీరా, కర్ణాటక మాజీమంత్రి శివన్నగౌడునాయక్‌ పుష్పగుచ్ఛమిచ్చి ఘన స్వాగతం పలికారు. రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, శాలువాలతో పూలమాలలతో సత్కరించారు. రాష్ట్రంలో అమలు పరుస్తున్న కేంద్ర పథకాలపై కొంతసేపు చర్చించారు. కేంద్రమంత్రి ఆదివారం రాత్రి మంత్రాల యంలోనే బసచేసి సోమవారం రాఘవేంద్రస్వామిని దర్శించుకుని పీఠాధిపతి ఆశీస్సులు పొందనున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:36 PM