Share News

Waqf Board: వక్ఫ్‌ స్థలాల్లో అభివృద్ధి పనులకు ఓకే

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:53 AM

రాష్ట్రంలోని వక్ఫ్‌ స్థలాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు బోర్డు అంగీకరించిందని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు.

Waqf Board: వక్ఫ్‌ స్థలాల్లో అభివృద్ధి పనులకు ఓకే

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వక్ఫ్‌ స్థలాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు బోర్డు అంగీకరించిందని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు కార్యాలయంలో 6వ బోర్డు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా పలు మేనేజ్‌మెంట్‌ కమిటీలను, ముతవల్లీలను నియమించినట్లు అజీజ్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 28 ప్రదేశాల్లో తాలిం -ఏ-హునర్‌ పేరుతో స్కిల్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు

Updated Date - Sep 18 , 2025 | 04:54 AM