Kurnool District: వర్షాలకు కూలిన రథశాల గోడ
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:44 AM
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయం రథశాల గోడకూలి ముగ్గురు మృతి చెందారు.
కర్నూలు జిల్లాలో ముగ్గురి మృతి
ఎమ్మిగనూరు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయం రథశాల గోడకూలి ముగ్గురు మృతి చెందారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రథశాల మట్టిగోడలు పూర్తిగా నానిపోయాయి. సోమవారం అర్ధరాత్రి తర్వాత రథశాల మట్టిగోడ కూలి ఓ గుడిసెపై పడి ంది. ఆ గుడిసెలో నిద్రిస్తున్న నాగరాజు (39), ఆయన కుమారుడు లక్ష్మీ నరసింహ(15) అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన నాగరాజు తల్లి లక్ష్మి, సోదరుడు రాజు (32)ల ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు.