VSAT Admission Notification: వి శాట్ నోటిఫికేషన్ జారీ
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:47 AM
గుంటూరు సమీపంలోని వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో బీటెక్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం విశాట్ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేశారు....
దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 25
మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ప్రవేశ పరీక్ష
రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు
గుంటూరు(విద్య), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గుంటూరు సమీపంలోని వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో బీటెక్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం విశాట్ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేశారు. ఈ మేరకు వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పీ. నాగభూషణ్ నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. 2026-27 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ బీఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బీ(హానర్స్), బీబీఏ ఎల్‌ఎల్‌బీ(హానరల్), అగ్రికల్చరల్, ఫార్మా డీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కోసం విశాట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు గడువు ఉందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విశాట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఆఫ్‌లైన్‌లో అన్ని వి జ్ఞాన్ క్యాంప్‌సలతోపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. వడ్లమూడిలోని వర్సిటీ క్యాంప్‌సతోపాటు హైదరాబాదులోని ఆఫ్ క్యాంప్‌సలో ఆయా కోర్సులు అందిస్తున్నామన్నారు. విద్యార్థులు https://admission.vignan.ac.in అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విశాట్ పరీక్షలో ర్యాం కులు సాధించిన వారికి దాదాపు రూ.48 కోట్ల వరకు ఉపకార వేతనా లు అందించనున్నట్టు తెలిపారు. ఇంటర్, జేఈఈ, మెయిన్స్ ర్యాం కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు అందిస్తామన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ దిరిశాల విజయరాము, డీన్ అడ్మిషన్స్ కేవీ కృష్ణకిశోర్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఏ. గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.