Justice for Revenue Officials: రెవెన్యూ అధికారులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:48 AM
అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీహెచ్.రవీంద్రరాజు కోరారు...
సంఘం అధ్యక్షుడు రవీంద్రరాజు
విజయవాడ (గాంధీనగర్), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీహెచ్.రవీంద్రరాజు కోరారు. రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను సచివాలయంలో బుధవారం ఆయన కలిశారు. 15 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వీఆర్‌ఓలకు డిప్యూటీ తహసీల్దార్ పే స్కేల్ ఇవ్వాలని, పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించాలని, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాటకొండ శ్రీనివాస్, ఉపాఽధ్యక్షుడు మిరియాల లక్ష్మీనారాయణ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.