Puttaparthi: పనితీరు బాగలేదంటూ వీఆర్వోలతో గుంజీలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:52 AM
పనితీరు బాగలేని వీఆర్వోల చేత శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ గుంజీలు తీయించారు.
ఆర్డీవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు
పుట్టపర్తి టౌన్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): పనితీరు బాగలేని వీఆర్వోల చేత శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ గుంజీలు తీయించారు. ఈనెల 18న పుట్టపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఆర్డీఓపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు వీఆర్వోలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆర్డీఓతో మాట్లాడుతానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.