Voters Express Emotions: మా వివేకా సార్‌కు న్యాయం చేయండి
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:55 AM
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కొందరు ఓటర్లు స్లిప్పులు రాసి తమ ఓటుతోపాటు బ్యాలెట్ బాక్సులో వేశారు. ఇలాంటి ఓ స్లిప్పుపై..
స్లిప్పుపై రాసి బ్యాలెట్ బాక్సులో వేసిన ఓటరు
30 ఏళ్ల తర్వాత ఓటు వేశామంటూ.. మరో స్లిప్పు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కొందరు ఓటర్లు స్లిప్పులు రాసి తమ ఓటుతోపాటు బ్యాలెట్ బాక్సులో వేశారు. ఇలాంటి ఓ స్లిప్పుపై ‘మా వివేకా సార్‌కు న్యాయం చేయండి సార్’ అని రాసి ఉండటం కౌంటింగ్ సందర్భంగా సిబ్బంది గుర్తించారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక..ఈ తరహాలోనే మరో రెండు కాగితాలను పోలింగ్ సిబ్బంది గుర్తించారు. ‘30సం.తర్వాత ఓటు వేశాను..అందరికి దండాలు’ అని ఒక దానిపైనా, ‘పోలీసన్న ధన్యవాదాలు.మీవల్లే ఓటు వేశానన్న. మా యబ్బ కూడా 30 ఏళ్లలో ఓటేయలేదన్న’ అని మరోదానిపై రాసి ఉంది. ఈ స్లిప్పులు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
- పులివెందుల, ఆంధ్రజ్యోతి