Tirumala: మన గుడి-మన బాధ్యత
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:40 AM
నంద్యాలకు చెందిన మనఊరు-మనగుడి-మనబాధ్యత సంస్థ వ్యవస్థాపకుడు శివకుమార్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది సేవకులు దేశంలోని వివిధ క్షేత్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తిరుమల నడక మార్గాలు, సందర్శనీయ స్థలాలను శుభ్రపరిచిన సేవా సంస్థ
వారంరోజుల్లో దాదాపు 4 టన్నుల చెత్తసేకరణ
తిరుమల, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి): నంద్యాలకు చెందిన ‘మనఊరు-మనగుడి-మనబాధ్యత’ సంస్థ వ్యవస్థాపకుడు శివకుమార్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది సేవకులు దేశంలోని వివిధ క్షేత్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అనుమతి తీసుకున్న వీరు..ఈ నెల 12వ తేదీ నుంచి సోమవారం వరకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాలు, శిలాతోరణం, వేదపాఠశాల వంటి వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు.ప్రధానంగా ప్లాస్టిక్ తొలగింపుపై దృష్టిసారించి వారంరోజుల్లో 3 నుంచి 4 టన్నుల చెత్తను సేకరించి తొలగించారు. ఈసందర్భంగా ఫౌండర్ శివకుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ..తాను ఓ ప్రభుత్వ ఉద్యోగినని, కొంతకాలంగా వారణాశి, అరుణాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చెత్తను తొలగిస్తూ సేవ చేస్తున్నామన్నారు.ఇందులో భాగంగా తిరుమలలోనూ స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.