Vizag Hand: మెడ్‌టెక్ జోన్‌లో వైజాగ్ హ్యాండ్
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:19 AM
విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో కొత్తగా దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ ప్రారంభించారు...
కృత్రిమ చేతుల తయారీ ప్రారంభం
దివ్యాంగుల కోసం ఇతర పరికరాలు కూడా..
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో కొత్తగా దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ ప్రారంభించారు. ఈ చేతులను ‘వైజాగ్ హ్యాండ్’గా వ్యవహరిస్తున్నారు. కాలు లేని దివ్యాంగులకు ‘జైపూర్ ఫుట్’ ఎలాగో చేతులు లేని వారికి ‘వైజాగ్ హ్యాండ్’ అలా పనిచేస్తుందని సీఈఓ జితేంద్రశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ మహిళ చేయిని కోల్పోగా ఆమెకు మయోఎలక్ర్టిక్ ప్రోస్థటిక్ హ్యాండ్ తయారుచేసి అమర్చామని, దాంతో ఆమె అన్ని పనులు చేసుకోగలుగుతున్నారని వివరించారు. దివ్యాంగులకు అవసరమైన కాళ్లు, చేతులతో పాటు సోలార్‌తో పనిచేసే వీల్ చైర్లను కూడా రూపొందిస్తున్నామని జితేంద్ర శర్మ వెల్లడించారు.