Palla Srinivas: విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేటుపరం కాదు
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:25 AM
విశాఖ ఉక్కు ప్రైవేటుపరమవుతోందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంత మంది నాయకులు.,..
తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు: పల్లా శ్రీనివాస్
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు ప్రైవేటుపరమవుతోందంటూ వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంత మంది నాయకులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం నిరాధారమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేటుపరం కాబోదన్నారు. సీఎం చంద్రబాబు ఉక్కు ప్లాంటు పరిరక్షణకు కృషి చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రూ.14 వేల కోట్లు తెచ్చి ప్లాంటుకు ఆర్థిక ఊపిరి పోశారని చెప్పారు. ప్లాంటును పూర్తిస్థాయిలో లాభాల్లోకి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.