Share News

Visakhapatnam Steel Plant: హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో స్టీల్‌ప్లాంట్‌ రికార్డు

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:32 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు నమోదుచేసింది. ప్లాంటులో మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులు ఉండగా వాటి ద్వారా రోజుకు 19 వేల టన్నుల హాట్‌ మెటల్‌.....

Visakhapatnam Steel Plant: హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో స్టీల్‌ప్లాంట్‌ రికార్డు

  • 24 గంటల వ్యవధిలో 21,012 టన్నులు

  • చిత్తశుద్ధిని నిరూపించుకున్న ఉక్కు ఉద్యోగులు

విశాఖపట్నం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు నమోదుచేసింది. ప్లాంటులో మూడు బ్లాస్ట్‌ ఫర్నేసులు ఉండగా వాటి ద్వారా రోజుకు 19 వేల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశిస్తే.. ఆదివారం ఉదయం ఆరు నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు బ్లాస్ట్‌ఫర్నేస్‌ 1,2,3 విభాగాల్లో.. వరుసగా 7,058 టన్నులు, 6,558, 7,396 టన్నులు కలిపి మొత్తం (ఏ,బీ,సీ షిఫ్ట్‌లు) 21,012 టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి జరిగింది. ఇంతకుముందు అంటే 2025 నవంబరు 30న ఇదే ప్లాంటులో 20,440 టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి చేశారు. అదే ఇప్పటివరకూ రికార్డు. దానిని అధిగమించి ఇప్పుడు ఉత్పత్తి రావడం విశేషం. ఈ విభాగంలో అధిక మొత్తంలో ఉత్పత్తి సాధించడంతో స్టీల్‌ మెల్ట్‌షాప్‌ (ఎస్‌ఎంఎస్‌) విభాగంలో ఉత్పత్తి మరింత పెరగనుంది. సంస్థ పట్ల తమకున్న నిబద్ధతకు, భవిష్యత్తు పట్ల ఆశాభావానికి ఇదే సంకేతమని ఉద్యోగ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. సమష్టి కృషి వల్లనే సాధ్యమైందని, అన్ని విభాగాల సహకారంతోనే దీనిని సాధించామని ఉద్యోగ, కార్మిక వర్గాలు పేర్కొన్నాయి. సంస్థను మళ్లీ లాభాట బాటలోకి తీసుకురావడానికి సొంత గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశాయి.

Updated Date - Dec 16 , 2025 | 03:32 AM