Drug Control Officials: విశాఖలో నిషేధిత దగ్గు మందు స్వాధీనం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:33 AM
నిషేధిత దగ్గు, జలుబు మందు రివి కోల్డ్‌ను విశాఖపట్నంలోని ఔషధ నియంత్రణ విభాగం అధికారులు పట్టుకున్నారు.
రూ.4.5 లక్షల విలువ చేసే 5,900 సిర్‌పలు గుర్తింపు
విశాఖపట్నం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): నిషేధిత దగ్గు, జలుబు మందు రివి కోల్డ్‌ను విశాఖపట్నంలోని ఔషధ నియంత్రణ విభాగం అధికారులు పట్టుకున్నారు. స్థానిక కిర్బిలైఫ్ సైన్సెస్ అనే మెడికల్ ఏజెన్సీ గోడౌన్‌లో రూ.4.5 లక్షల విలువచేసే 5,900 నిషేధిత సిర్‌పలను స్వాధీనం చేసుకున్నారు. సిరప్ తయారీ సంస్థలు రెండేళ్ల లోపు పిల్లలకు ఈ మందు వాడకూడదనే లేబుల్‌ను ప్రత్యేకంగా ముద్రించాలి. అయితే ఈ ముద్రణ లేని మందును విశాఖ మర్రిపాలెం ప్రాంతానికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసి తెచ్చినట్టు అధికారులకు సమాచారం అందింది. సోమవారం మర్రిపాలెంలోని కిర్బి లైఫ్ సైన్సెస్ ఏజెన్సీ గోడౌన్‌లో తనిఖీలను నిర్వహించగా.. 5,900 నిషేధిత సిర్‌పలు పట్టుబడ్డాయి.