Six YSRCP Activists Arrested: ధర్మవరంలోనూ రక్తాభిషేకం!
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:35 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోనూ ఆ పార్టీ కార్యకర్తలు వేట కొడవళ్లతో క్రూరంగా పొట్టేళ్లను నరికి ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు...
జగన్ పుట్టినరోజున కార్యకర్తల హల్‌చల్
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. ఆరుగురి అరెస్టు
ధర్మవరం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోనూ ఆ పార్టీ కార్యకర్తలు వేట కొడవళ్లతో క్రూరంగా పొట్టేళ్లను నరికి ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. ఈ నెల 21న వైసీపీ కార్యకర్తలు పొట్టేళ్ల తలలు నరికి.. జగన్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు. ఆ వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు స్పందించి తొమ్మిది మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. వీరిలో ఆరుగురు.. తిమ్మారెడ్డి మల్లికార్జునరెడ్డి, రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి, వినయ్ గౌడ్, సాకే కాశప్ప, దాసరి మల్లికార్జున, దేవరపల్లి ఓబిరెడ్డిలను అరెస్టు చేశామని టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు.