వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:49 PM
వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అచలానంద ఆశ్రమం పీఠాధిపతి విరజానందస్వామి పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు టౌన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని అచలానంద ఆశ్రమం పీఠాధిపతి విరజానందస్వామి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం శ్రీకృష్ణ గీతాశ్రమంలో నగర గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవ కమిటీల నిర్వాహకులు, కుల సంఘాల నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండుగలను ప్రజలందరూ ఐకమత్యంతో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునరావు, డాక్టర్ దస్తగిరిరెడ్డి, శివనారాయణ, దండపాణి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.