Share News

భక్తిశ్రద్ధలతో విళక్కు మహోత్సవం

ABN , Publish Date - Dec 08 , 2025 | 11:57 PM

పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్ప సేవా స మాజం ఆధ్వర్యంలో స్వామివారి విళక్కు మహోత్సవం వైభవం గా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో విళక్కు మహోత్సవం
అయ్యప్పస్వామి గ్రామోత్సవం

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్ప సేవా స మాజం ఆధ్వర్యంలో స్వామివారి విళక్కు మహోత్సవం వైభవం గా నిర్వహించారు. ఉదయం కన్నెస్వాములు మేళ వాయిద్యాలతో కలశయాత్ర నిర్వహించారు. చెరువుకట్ట వద్ద ఉత్సవ విగ్రహా నికి జలాభిషేకం చేపట్టారు. ముఖ్య అతిథులుగా టీడీపీ నాయ కులు ఎనఎండీ ఫిరోజ్‌, కౌన్సిలర్‌ ఖండే శ్యామ్‌సుందర్‌లాల్‌, చి న్నపురెడ్డి తదితరులు పాల్గొని ఆయుధపూజ, మూలవిరాట్‌కు పు ష్పాభిషేకం, ప్రత్యేక పూజలు చేపట్టారు. అయ్యప్ప ఉత్సవ విగ్ర హానికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. సాయం త్రం దీపాలంకరణ, గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి అష్టాదశ కలశ్వానిత పడిపూజ మహోత్సవం, ఊంజలసేవ తదితర కార్యక్ర మాలు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారి గోపీ స్వామి, గం గిశెట్టి శ్రీధర్‌, నాగరాజు, బవిరిశెట్టి శ్రీకాంత, గురుస్వామి లక్ష్మ య్య, రామలింగారెడ్డి,సురేష్‌, శ్రీరామమూర్తి, అయ్యప్ప సేవాస మాజం సభ్యులు, నాయకులు,కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 11:57 PM