Share News

Vijayawada Utsav Praised by PVS Madhav: విజయవాడ ఉత్సవ్‌ అద్భుతం

ABN , Publish Date - Oct 02 , 2025 | 03:39 AM

విజయవాడ ఉత్సవ్‌ అద్భుత ఘట్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్‌ మాధవ్‌ అన్నారు. పున్నమి ఘాట్‌లో బుధవారం జరిగిన సాంస్కృతిక..

Vijayawada Utsav Praised by PVS Madhav: విజయవాడ ఉత్సవ్‌ అద్భుతం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్‌ మాధవ్‌

‘విజయవాడ ఉత్సవ్‌’ అద్భుత ఘట్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్‌ మాధవ్‌ అన్నారు. పున్నమి ఘాట్‌లో బుధవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ‘విజయవాడ ఉత్సవ్‌’ దోహదపడుతుందన్నారు. సీఎం చంద్రబాబు.. కళలు, సాంస్కృతిక పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఏడాది జరిగే ‘విజయవాడ ఉత్సవ్‌’కు ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాధవ్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఘనంగా సత్కరించి కొండపల్లి బొమ్మలను బహూకరించారు.

Updated Date - Oct 02 , 2025 | 03:39 AM