Share News

Vijayawada: మ్యూజిక్‌.. జోష్‌

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:44 AM

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌లో ఆదివారం నాటి మ్యూజికల్‌ నైట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గొల్లపూడి ఎగ్జిబిషన్‌లోని కళావేదికపై...

Vijayawada: మ్యూజిక్‌.. జోష్‌

  • మ్యూజికల్‌ నైట్స్‌కు జన ప్రవాహం

  • విజయవాడ ఉత్సవ్‌లో అలరించిన రామ్‌ మిరియాల, సాకేత్‌

ఇంటర్నెట్ డెస్క్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవ్‌’లో ఆదివారం నాటి మ్యూజికల్‌ నైట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గొల్లపూడి ఎగ్జిబిషన్‌లోని కళావేదికపై ప్రముఖ సింగర్‌ రామ్‌ మిరియాల తన గాత్ర మాధుర్యంతో యువతను ఉర్రూతలూగించారు. ఏకంగా స్టేజీ వద్దకు చొచ్చుకు వచ్చి డ్యాన్సులతో అదరగొట్టారు. పున్నమిఘాట్‌లో సాకేత్‌ టీమ్‌ మ్యూజికల్‌ నైట్‌ అదరహో అనిపించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాప్రదర్శనలు సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. సంగీత కచేరీలు, జానపద, శాస్త్రీయ నృత్యాలు, నాటిక , నాటకాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఘంటసాల సంగీత కళాశాలలో కూడా నృత్య ప్రదర్శనలు, జానపదాలు, మిమిక్రీ, మ్యాజిక్‌ షోలు ఉర్రూతలుగించాయి. హాస్యనాటికలు కడుపుబ్బ నవ్వించాయి. ‘పల్నాటి యుద్ధం’ నాటక ప్రదర్శన అద్భుతంగా సాగింది.

- ఆంధ్రజ్యోతి, విజయవాడ

Updated Date - Sep 29 , 2025 | 03:45 AM