Tender Extension: విజయవాడ మెట్రో టెండర్ల గడువు పెంపు
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:11 AM
విజయవాడ మెట్రో రైల్ టెండర్ల గడువును ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్‌సీ) మరోసారి పొడిగించింది. విజయవాడ మెట్రో రైల్ సివిల్ నిర్మాణాలకు...
విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): విజయవాడ మెట్రో రైల్ టెండర్ల గడువును ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏపీఎంఆర్‌సీ) మరోసారి పొడిగించింది. విజయవాడ మెట్రో రైల్ సివిల్ నిర్మాణాలకు ఏపీఎంఆర్‌సీ రూ.4,500 కోట్లతో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్లకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. మంగళవారం టెండర్లను తెరవాల్సిన సమయంలో కాంట్రాక్టు సంస్థలు స్వల్ప గడువును కోరాయి. దీంతో మరో 10 రోజులు అంటే ఈనెల 24వ తేదీ వరకు పొడిగించారు. ప్రధాన ఇన్‌ఫ్రా కంపెనీల అభ్యర్థన మేరకు పొడిగించినట్టు ఏపీఎంఆర్‌సీ ఎండీ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు.