Vijayawada ACB Court: లిక్కర్ నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:52 AM
మద్యం కుంభకోణంలో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది.
విజయవాడ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. జైలులో ఉన్న ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప తమకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాదనలు ముగియడంతో న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం తీర్పును వెలువరించారు. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేశారు. అదేవిధంగా బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి, మాజీ ప్రత్యేకాధికారి డి.సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది.