Vijayanagaram SP AR Damodhar: ఉత్తమ దర్యాప్తు అధికారిగా విజయనగరం ఎస్పీకి పురస్కారం
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:37 AM
విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ శాఖలో ఉత్తమ దర్యాప్తు అధికారిగా అవార్డును అందుకున్నారు. శుక్రవారం ఈ అవార్డును డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా తీసుకున్నారు...
ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత హత్య కేసు ఛేదింపునకు గుర్తింపు
విజయనగరం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ శాఖలో ఉత్తమ దర్యాప్తు అధికారిగా అవార్డును అందుకున్నారు. శుక్రవారం ఈ అవార్డును డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా తీసుకున్నారు. అమరావతిలో కలెక్టర్లు, ఎస్పీల సదస్సు రెండు రోజులు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ కింద రాష్ట్ర పోలీస్ శాఖ నాలుగు విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. ఇందులో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్పీ దామోదర్‌కు అత్యుత్తమ పురస్కారం లభించింది. ఇంతకు ముందు ఆయన ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినపుడు.. ఈ ఏడాది ఏప్రిల్ 22న టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఎస్పీ దామోదర్‌తో పాటు 100 టీంలను నియమించారు. ఎస్పీ ప్రత్యేక దర్యాప్తు బృందాలతో విచారణ చేపట్టి కొలిక్కి తెచ్చారు. తర్వాత దామోదర్ ఈ ఏడాది సెప్టెంబరులో విజయనగరం జిల్లాకు ఎస్పీగా వచ్చారు. రఘురామ టార్చర్ విషయంలో పీవీ సునీల్‌కుమార్ కేసును కూడా ఈయనే దర్యాప్తు చేస్తున్నారు.
మరింత బాధ్యతను పెంచింది
డీజీపీ చేతుల మీదుగా అవార్డును తీసుకోవటం చాలాసంతోషంగా ఉంది. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచింది. వీరయ్య చౌదరి హత్య కేసును ఆధునిక టెక్నాలజీనీ వినియోగించి ఛేదించాం. - ఎస్పీ ఏఆర్ దామోదర్