Archaeology Survey: రాయల కాలం నాటి శిలా శాసనాలు లభ్యం
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:12 AM
కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీలో ఓ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా రెండు శిలా శాసనాలు బయట పడ్డాయి.
ప్రొద్దుటూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీలో ఓ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా రెండు శిలా శాసనాలు బయట పడ్డాయి. ఈ శిలాశాసనాలు శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటివిగా తెలుస్తోంది. వెన్నపూస భరత్‌రెడ్డి అనే వ్యక్తి ఈ శిలా శాసనాలను ఫేస్‌బుక్‌లో పెట్టారు. వాటిని కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఉన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి పరిశీలించి అందులో ఉన్న విషయాలను తెలియజేశారు. ఈ శిలా శాసనం శక 1444, చిత్రభాను మాఘ శుద్ధ 7న రాశారని.. దీనిని చారిత్రక పద్ధతిలో వివరిస్తూ క్రీస్తు శకం 1523 సీఈ జనవరి 24 శనివారంగా తెలియపరిచారు. శ్రీకృష్ణ దేవరాయలు తన భార్య తిరుమల దేవి యోగ్యత కోసం కవులూరు గ్రామంలో చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టు వెల్లడించారు. ఆలయ ప్రాకారం కోడి నిర్మాణంలో రికార్డు చేశారని తెలిపారు.