Vijay Deverakonda visits: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:22 AM
సినీనటుడు విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండతో....
కుటుంబ సభ్యులతో కలిసి సత్యసాయి మహాసమాధి సందర్శన
పుట్టపర్తి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): సినీనటుడు విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలోని పుట్టపర్తికి విచ్చేశారు. ప్రశాంతి నిలయంలో ఆయనకు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వర్గాలు స్వాగతం పలికాయి. అనంతరం సాయికుల్వంత్ మందిరానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని వారు దర్శించుకున్నారు. తర్వాత శాంతిభవనం వద్దకు చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బస చేసి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. సినీనటి రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ వివాహం నిశ్చమైన నేపథ్యంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నట్లు చర్చ జరుగుతోంది.