ఆత్మకూరు డీడీగా విఘ్నేష్ అప్పావ్
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:36 PM
ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్‌గా విఘ్నేష్ అప్పావ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.
ఆత్మకూరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్‌గా విఘ్నేష్ అప్పావ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సాయిబాబా కొన్ని రోజుల పాటు డెహ్రాడూనలో జరిగే ట్రైనింగ్‌కు వెళ్లారు. ఆయన స్థానంలో శ్రీశైలం సబ్ డీఎఫ్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్ రవూఫ్ ఇనచార్జ్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో అబ్దుల్ రవూఫ్‌ను మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేసి ఆయన స్థానంలో అనంతపురం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న విఘ్నేష్ అప్పావ్‌ను ఆత్మకూరుకు బదిలీ చేశారు. తమిళనాడులోని కొయంబత్తూరు ప్రాంతానికి చెందిన విఘ్నేష్ అప్పావ్ 2020లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ సున్నిపెంటకు సబ్ డీఎఫ్‌వోగా వచ్చిన ఆయన ఆ ఆ తర్వాత 2022లో మార్కాపురం డీఎఫ్‌వోగా పని చేసి అనంతపురం జిల్లాకు వెళ్లారు. మార్కాపురం డీఎఫ్‌వోగా పనిచేసిన సమయంలో ఒక నెలరోజుల పాటు ఆత్మకూరు ఇనచార్జ్ డీఎఫ్‌వోగా కూడా పనిచేశారు. మొత్తంగా ఐదేళ్లలో నాలుగేళ్ల పాటు ఎనఎస్‌టీఆర్ పరిధిలోనే పనిచేయడం గమనార్హం. బాధ్యతల తీసుకున్న వెంటనే ఆయా రేంజ్‌ల, ఇతర విభాగాల అధికారులతో సమీక్షించారు. తొలి ప్రాధాన్యతగా అటవీ, వన్యప్రాణుల సంరక్షణపైనే ఉంటుందని ఇందుకోసం అటవీ ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. విధినిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నల్లమలలో పనిచేసి అనుభవం ఉండటం వల్ల అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించేందుకు చొరవ తీసుకుంటానని వెల్లడించారు.