Vignan University: ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌కి 70వ ర్యాంకు
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:19 AM
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) గురువారం విడుదల చేసిన 2025వ సంవత్సరం ఉన్నతస్థాయి విద్యాసంస్థల ఎన్‌ఐఆర్‌ఎఫ్...
గుంటూరు(విద్య), సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) గురువారం విడుదల చేసిన 2025వ సంవత్సరం ఉన్నతస్థాయి విద్యాసంస్థల ఎన్‌ఐఆర్‌ఎఫ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) ర్యాంకుల్లో విజ్ఞాన్స్ యూనివర్సిటీకి జాతీయస్థాయిలో 70వ ర్యాంకు లభించిందని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పి.నాగభూషణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన్స్ యూనివర్సిటీకి 70వ ర్యాంకు లభించిందన్నారు. అదే విధంగా ఇంజనీరింగ్ విభాగంలో కూడా 80వ ర్యాంకు సాధించినట్టు చెప్పారు. టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్, ఔట్‌రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, పీఆర్ పర్‌సెప్షన్ కేటగిరీల్లో విజ్ఞాన్స్ యూనివర్సిటీ పనితీరును కేంద్రం పరిశీలించి 100 పాయింట్ల స్కోర్ ప్రామాణికంగా ఈ ర్యాంకులను కేటాయించిందన్నారు. ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫలో ఉత్తమ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన ఐక్యూఏసీ టీంను విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్‌లర్, కల్నల్ ప్రొఫెసర్ పి.నాగభూషణ్, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ర్టార్ డాక్టర్ పీఎంవీ రావు ప్రత్యేకంగా అభినందించారు.