AP Agros Scam: ఆగ్రోస్ అవకతవకలపై విజిలెన్స్ విచారణ లేనట్టేనా
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:41 AM
ఏపీ ఆగ్రోస్‌లో అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిగేలా కనిపించడం లేదు. విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించాలని వ్యవసాయశాఖ...
అమలుకాని మంత్రి అచ్చెన్న ఆదేశాలు
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఏపీ ఆగ్రోస్‌లో అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిగేలా కనిపించడం లేదు. విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గత నెల 27న అధికారులను ఆదేశించినా నేటివరకూ కదలిక లేదు. ఇంతవరకు విజిలెన్స్‌కు లిఖితపూర్వకంగా సమాచారం పంపలేదని అధికార వర్గాలే చెప్తున్నాయి. విజిలెన్స్ విచారణ జరగకుండా ‘ఎవరో’ అడ్డుపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వ్యవసాయ పరికరాల కొనుగోలు, టెండర్ల ప్రక్రియలో కొందరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అయినా ఉన్నతాధికారులు ఉదాసీనంగా ఉండడం విమర్శలకు దారి తీస్తోంది.